తోపుడు బండిగా మారిన ‘బడి’ బండి..

by Sridhar Babu |   ( Updated:2021-10-29 10:20:01.0  )
తోపుడు బండిగా మారిన ‘బడి’ బండి..
X

దిశ, గోదావరిఖని : కరోనా తగ్గుముఖం పట్టడంతో కొన్ని నిబంధనల మేరకు ప్రభుత్వం పాఠశాలను ప్రారంభించింది. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి ఫిట్నెస్ లేకుండా ఉన్న బస్సులను నడిపిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ క్రమంలోనే పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు నడిరోడ్డుపై నిలిచిపోవడంతో బడి బండి కాస్త తోపుడు బండిగా మారింది. గమనించిన స్థానికులు బస్సును రోడ్డు పక్కకు నెట్టారు.

ఇలా కనీస సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకోకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్కూళ్లను ప్రారంభించే ముందే వాహనాల ఫిట్నెస్‌ను పరీక్షించాల్సిన బాధ్యత ప్రాంతీయ రవాణా అధికారులకు ఉన్నా వారి నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన వాహనాల ఫిట్నెస్‌లను పరిశీలించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed