- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటిలో తేలే ఏటీఎమ్.. ఎక్కడంటే ?
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శ్రీనగర్‌లోని దాల్ సరస్సుపై ఫ్లోటింగ్ ఏటీఎమ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పర్యాటకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిలో తేలే ఏటీఎమ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 16న ఈ ఫ్లోటింగ్ ఏటీఎమ్‌ను ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు.
పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండే శ్రీనగర్‌లో మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు ఎస్‌బీఐ ఈ ఫ్లోటింగ్ ఏటీఎంను తీసుకొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. దాల్ సరస్సులోని హౌస్‌బోట్‌లో ఈ ఏటీఎం ఉందని, ప్రజలు ఎప్పటినుంచో దీనికోసం ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు. దాల్ సరస్సుపై ఇప్పటికే నీటిలో తేలియాడే కూరగాయల మార్కెట్, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. కాగా, భారత్‌లో మొట్ట మొదటిసారిగా కొచ్చిలో ఫ్లోటింగ్ ఏటీఎంను ఎస్‌బీఐ ఏర్పాటు చేసింది.