ఎస్‌బీఐ రిటైర్డ్ ఉద్యోగులకు కొవిడ్-19 చికిత్స

by Harish |
ఎస్‌బీఐ రిటైర్డ్ ఉద్యోగులకు కొవిడ్-19 చికిత్స
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Sbi) కొవిడ్-19 నేపథ్యంలో తమ రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఎస్‌బీఐలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మెడికల్ ఇన్సూరెన్స్ పథకం (medical insurance scheme)లో కొవిడ్-19 చికిత్సను కూడా జత చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ ఇన్సూరెన్స్ పథకంలో కరోనా చికిత్సను కూడా పొందుపరిచి, ఈ పథకం ప్రయోజనాల కింద ఉబ్బసంతో పాటు సంబంధిత మరో నాలుగు వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు ఆసుపత్రుల్లో చేరేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పథకాన్ని సమీక్షించి ఆసుపత్రిలో ఉన్న వ్యాధుల జాబితాలో కొవిడ్-19(movie. 19)ను కూడా చేర్చాలని నిర్ణయించామని బ్యాంకు వెల్లడించింది.

దీంతో వ్యాధుల సంఖ్య 20 నుంచి 25కు పెరిగిందని బ్యాంకు పేర్కొంది. ఇంట్లోనే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా చికిత్స కోసం రూ. 25 వేల వరకు ఖర్చులను అనుమతించామని తెలిపింది. ఇప్పటికే ఎస్‌బీఐలో పనిచేసున్న ప్రస్తుత ఉద్యోగులు కొవిడ్-19 చికిత్స కవరేజ్ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఎస్‌బీఐ నిర్ణయంతో రిటైర్ అయిన ఉద్యోగులకు భారీ ఊరట అని, రిటైర్ అయిన ఉద్యోగులు అదనంగా మరో బీమా తీసుకోవాల్సిన అవసరం లేదని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారు. సీనియర్ సిటిజన్లుగా ఉన్న వీరికి బీమా కొనుగోలు ఖర్చు తగ్గడం ఉపశమనమని ఎస్‌బీఐ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed