- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐపీఓ ద్వారా ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌లో వాటా విక్రయానికి బోర్డు ఆమోదం!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ తన మ్యూచువల్ ఫండ్ ఐపీఓకు, బోర్డు ఆమోదం లభించినట్టు బుధవారం వెల్లడించింది. దీని ద్వారా ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని 6 శాతం వాటాను అమ్మేందుకు సెంట్రల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతిచ్చిందని బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఇప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ కార్డ్స్ విభాగాలను లిస్టింగ్ చేయడం ద్వారా ఎస్‌బీఐ గణనీయమైన విలువను సాధించిందని, మ్యూచువల్ ఫండ్‌ను కూడా స్టాక్ మార్కెట్లలో నమోదు చేయడం మంచి పరిణామమని ఎస్‌బీఐ భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లోని ఈ రంగంలో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది. దాదాపు రూ. 5 లక్షల కోట్ల ఆస్తులను సంస్థ నిర్వహిస్తోంది. అంతేకాకుండా గతేడాది ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ లాభాలు రూ. 498 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌లో ఎస్‌బీఐకి 63 శాతం వాటా ఉండగా, మిగిలిన 37 శాతం విదేశీ అమండి అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ చేతిలో ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఓలో భాగంగా అమండి సంస్థ వాటాలను కూడా ఎస్‌బీఐ విక్రయిస్తుందా లేదా అనేదానిపై బ్యాంకు స్పష్టత ఇవ్వలేదు.