GOOD NEWS : ఇకపై ఇంటి నుంచే ‘హెల్త్ ఇన్స్యూరెన్స్’ .. Google pay ద్వారా సింగిల్ క్లిక్‌తో..!

by Harish |   ( Updated:2021-10-30 06:31:22.0  )
GOOD NEWS : ఇకపై ఇంటి నుంచే ‘హెల్త్ ఇన్స్యూరెన్స్’ .. Google pay ద్వారా సింగిల్ క్లిక్‌తో..!
X

దిశ, వెబ్‌డెస్క్ : జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లోనే బాగా పేరొందిన ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ (SBI General Insurance) తమ కస్టమర్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తన సేవలను మరింత విస్తరించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఇంటి నుంచి బీమా కొనుగోలు చేసే విధంగా కస్టమర్లకు వీలును కల్పిస్తోంది. అందుకోసం ప్రముఖ కంపెనీల్లో ఒకటైన గూగుల్ పే(Google Pay)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇకపై కస్టమర్లు బీమా కోసం ఏజెంట్ల వెంట తిరగాల్సిన అవసరం లేదు. మీ అరచేతిలోనే వివిధ రకాల పాలసీలు, దానికి సంబంధించిన వివరాలు అన్నింటినీ SBI జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నది. కస్టమర్లు ముందుగా గూగుల్ పే యాప్‌ ఓపెన్ చేసి అందులో ఎస్‌బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లా్న్స్‌ను సెర్చ్ చేసుకుని మీకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చును. బీమా సేవలను మరింత విస్తరించాలనే ప్రయత్నంలో భాగంగానే ఎస్‌బీఐ జనరల్.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకుని గూగుల్ పే సాయంతో తన కస్టమర్లను పెంచుకుంటోంది.

అయితే, మనదేశంలోని ఇన్స్యూరెన్స్ కంపెనీలతో గూగుల్ పే భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే ఫస్ట్ టైం.ఈ సర్వీసు అందుబాటులోకి రావడంతో ఇకపై కస్టమర్లు గూగుల్ పే సాయంతో (Google Pay Spot) క్షణాల్లో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం పెరగడంతో వినియోగదారులు తమ అవసరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఆర్థిక సేవలను అందించడంలో కస్టమర్ల అంచనాలకు తగిన విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వలన అధిక సంఖ్యలో వ్యక్తులను బీమా పరిధిలోకి తీసుకురావడం సాధ్యమవుతుంది. కావున గూగుల్ పే ప్లాట్‌ఫామ్‌లో ఎస్‌బీఐ జనరల్.. ఆరోగ్య సంజీవని అనే ఒక ప్రామాణిక హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ను తక్కువ ప్రీమియంతో అందిస్తున్నది. గూగుల్ పే యూజర్స్ కూడా ఎస్‌బీఐ కొత్తగా అందిస్తున్న సేవలను గూగుల్ పే స్పాట్‌ ద్వారా ఆరోగ్య సంజీవని బీమాను కొనుగోలు చేయవచ్చునని పేర్కొన్నారు. ఇది అతి తక్కువ ప్రీమియంలతో కూడా ఈ పాలసీ లభిస్తుందని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ మరియు సీఈఓ ప్రకాష్ చంద్ర కంద్‌పాల్ తెలిపారు. ఏది ఏమైనా SBI ఒక కొత్త పందాలో తన ఖాతాదారులను అకర్షించే విధంగా ప్రణాళికలు వేస్తు ముందుకు దూసుకుపోతుంది.

Advertisement

Next Story

Most Viewed