- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీతం తగ్గిస్తే రోడ్డున పడతానంటున్న ఎస్‌బీఐ ఛైర్మన్!
దిశ, వెబ్‌డెస్క్: 30 లక్షల కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్న, 2 లక్షలకు పైగా ఉద్యోగులున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు(ఎస్‌బీఐ)ని నిర్వహిస్తున్న టాప్ బ్యాంకర్ రజనీష్ కుమార్ తనకు జీతాలు తగ్గిస్తే వీధిలో నివసించాల్సి వస్తుందని అన్నారు. బ్యాంకులో నిధులున్నప్పటికీ రుణాలు తీసుకునే వారు లేరని ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ తాజాగా మరో ఆసక్తి కలిగించే వ్యాఖ్య చేశారు. ఎస్‌బీఐ ఛైర్మన్ విశ్లేషకులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రైవేట్ రంగంలోని బ్యాంకుల్లో వేతనాల్లో కోత విధిస్తున్నారు కదా ఎస్‌బీఐలోనూ అలాంటి పరిస్థితి ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు.. అలా తగ్గిస్తే రోడ్డుమీదికొచ్చి నివసించాల్సి వస్తుందని, ఇప్పటికే వేతనం చాలా తక్కువ ఉందని ఆయన చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆయన సరదాగా చెప్పినప్పటికీ, విశ్లేషకులూ సరదగా తీసుకున్నప్పటికీ ఇండియాలో ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకర్లకు చెల్లించే విధానాల్లో ఎంత అంతరం ఉందో తెలుస్తోందని కొందరు చెబుతున్నారు. ఎస్‌బీఐ ఛైర్మన్‌గా రజనీష్ కుమార్ వార్షిక వేతనం 2019 ఏడాదికి రూ. 29,53,750 గా ఉంది. ఎప్పటినుంచో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బ్యాంకు ముఖ్య అధికారులకు ఇచ్చే జీతభత్యాల్లో వ్యత్యాసం ఉంది. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకులోని ముఖ్య అధికారులకు ఖరీదైన ప్రాంతాల్లో నివాస వసతి ఏర్పాట్లు వంటి ప్రోత్సాహకాలుంటాయి. ప్రైవేట్ బ్యాంకు ఈ స్థాయిలో సౌకర్యాలను అందించవు. వేతనాలు మాత్రం కొన్ని రెట్లు ఉంటాయి. ఇటీవల బ్యాంకుల బోర్డు బ్యూరో ప్రభుత్వ రంగంలోని బ్యాంకర్ల వేతనాల విషయంలో మార్పులు తేవాలని సూచించాయి.