దేవస్థానం భూముల‌ను కాపాడండి..!

by Sridhar Babu |
దేవస్థానం భూముల‌ను కాపాడండి..!
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవస్థాన భూములను కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నార‌ని బీజేపీ రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ మెంబర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ ఆర్‎వీ కర్ణన్, పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ కమిషనర్ల‌కు ఫిర్యాదు చేశారు. ముగ్గురు అధికారుల‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story