- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో మరో భారీ పెట్టుబడి!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అనుబంధంగా ఉన్న రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మరో భారీ పెట్టుబడులను సాధించింది. అతిపెద్ద అంతర్జాతీయ సావరీన్ వెల్త్ ఫండ్‌లలో ఒకటిగా పెరున్న సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో 2.04 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 9,555 కోట్లని రిలయన్స్ గురువారం ప్రకటనలో వెల్లడించింది.
తాజా పెట్టుబడితో రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో ఇది ఎనిమిదో పెట్టుబడి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ఐఎల్ అధినేత ముఖేశ్ అంబానీ.. సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌తో దీర్ఘకాలంగా అనుబంధం ఉందని, దేశీయ రిటైల్ రంగంలో మార్పులకు ఈ భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. అదేవిధంగా భారత ఆర్థికవ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. కాగా, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ఇప్పటివరకు 10.09 శాతం వాటా విక్రయించబడింది. ఈ ఒప్పందాల ద్వారా మొత్తం రూ. 47,65 కోట్లకు విక్రయించింది. వాటాలను కొనుగోలు చేసిన వాటిలో ముబదలా ఇన్వెస్ట్‌మెంట్, జనరల్ అట్లాంటిక్, సింగపూర్ సావరిన్ వెల్త్‌ఫండ్, సిల్వర్ లేక్, కేకేఆర్ సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చాయి.