కరోనాకి సత్యసాయి ట్రస్టు విరాళం 10 కోట్లు

by srinivas |
కరోనాకి సత్యసాయి ట్రస్టు విరాళం 10 కోట్లు
X

కరోనా విజృంభిస్తుండడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని నిరుపేద ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు పథకాలు ప్రకటించింది. అయితే దేశంలోని అన్ని రంగాలు తాత్కాలికంగా మూత పడిన పరిస్థితుల్లో.. కరోనాపై పోరాటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరాళాలు సేకరిస్తున్నాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 10 కోట్ల విరాళం ప్రకటించింది. 5 కోట్ల రూపాయలు పీఎం కేర్స్‌కు పంపింది. మరో ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే.రత్నాకర్ అందజేశారు. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాల కోసం 1.80 కోట్ల సహాయం అందించింది. దీంతో సత్యసాయి ట్రస్టు సాయం 11.80 కోట్లు

Advertisement

Next Story

Most Viewed