ఈ రాశి స్త్రీలు.. మనసుకు నచ్చిన పనులు ఆనందంగా చేస్తారు

by Anukaran |
Panchangam
X

తేది : 18, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ద్వాదశి
(నిన్న ఉదయం 8 గం॥ 10 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 55 ని॥ వరకు)
నక్షత్రం : ధనిష్ట
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 38 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 22 ని॥ వరకు)
యోగము : సుకర్మము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 38 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 29 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 37 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 16 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : మకరము

మేష రాశి: ఆర్థిక పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఒక శుభవార్త కుటుంబంలో అందరికీ సంతోషం కలిగిస్తుంది. కళా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. కొందరికి పాత బాకీలు వసూలు అయ్యి అనుకోని డబ్బు వస్తుంది. నూతన నగలు వస్తువులు కొంటారు. వ్యాపారం బాగా పుంజుకుంటుంది. ఉద్యోగంలో అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ మనసు నాకు నచ్చిన పనులు ఆనందంగా చేస్తారు.

వృషభ రాశి: ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విదేశాలతో వ్యాపారం చేసే వారు ఈ రోజు అనుకున్నంత లాభాలను పొందలేరు. ఒక శుభవార్త కుటుంబంలో అందరికీ ఆనందం కలిగిస్తుంది. కళా రంగంలో వారికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న వారికి గురుకృప లభిస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ ప్రయత్నాలలో నూతన మార్గాలను వెతకండి విజయం లభిస్తుంది.

మిధున రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరం గా ఉండి అవసరాలకు తగిన డబ్బులు ఖర్చు పెడతారు. కుటుంబంలోని వారి కొరకు తగిన సమయం కేటాయించండి వారితో గడపండి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు మీ సామర్థ్యానికి పరీక్ష. సరి అయిన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి పూర్తిగా ప్రయత్నించండి. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలోని సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి: ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పూర్తిగా చక్కబడుతుంది. పాత బాకీలను తీర్చకుండా కొత్తగా అప్పు అడిగే బంధువులను దూరం పెట్టండి. ఉద్యోగంలో మీరు అంటే పడని వారిని ధైర్యంగా ఎదుర్కొండి. మీ సామర్థ్యాన్ని అందరూ ప్రశంసిస్తారు. ముఖ్య అవసరాలకు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి. స్థిరాస్తుల కొనుగోలుకు అవకాశం. కొంత మందికి కంటి జబ్బులకు అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక విచారం.

సింహరాశి: ఆరోగ్యపరంగా మరియు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. నూతన గృహ కొనుగోలుకు అవకాశం. ఫిట్ నెస్ కొరకు అధిక శ్రమ చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో మీకు అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ధనలాభం ఉంది. ఇంకా సంపాదించాలనుకునే వారికి ప్రణాళిక ప్రకారం పెట్టుబడి పెట్టండి. కుటుంబం లోని సభ్యులు మీ మాట వినడం లేదని మానసిక అశాంతి. వ్యాపారంలో భాగస్వాములతో నూతన పెట్టుబడులపై మంతనాలు జరుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో చిన్న విభేదాలు రావచ్చు.

కన్య రాశి: ముఖ్య విషయాలలో స్థిర నిర్ణయాలు తీసుకోండి. స్థిరాస్తి విషయాలు ఒక కొలిక్కి రావచ్చు. రావలసిన ధనము చేతికందే సమయం. నిరుద్యోగులకు వారు ఎదురు చూస్తున్న ఉద్యోగం గురించి శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో అందరి ప్రశంసలు లభిస్తాయి. కొంతమందికి ప్రమోషన్ కు అవకాశం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇతరుల మెప్పుకోసం దుబారా అనవసరపు ఖర్చులు చేయకండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఇస్తున్న గౌరవం మీకు ఆనందాన్ని ఇస్తుంది.

తులారాశి: ఫిట్ నెస్ కోసం యోగా మెడిటేషన్ చేయండి. దీని వలన మీకు మానసిక మరియు శారీరక ఆరోగ్యం లభిస్తుంది. కుటుంబంలోని సభ్యులతో ఆర్థికపరమైన విషయాలపట్ల గొడవలు రావచ్చు. వ్యాపారంలో కొత్త వెంచర్స్ వల్ల లాభాలకు అవకాశం. అమ్మకానికి పెట్టిన ప్రాపర్టీ వల్ల లాభం. కొందరికి ఇంటిలో వివాహ శుభ కార్యాలకు అవకాశం. ఉద్యోగంలో మీ సామర్థ్యంపై అందరూ ప్రశంసలు కురిపిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి: సమాజంలో మీరు ఎదగడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో మీకు అప్పగించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన విషయాలు పూర్తిగా మీ కంట్రోల్ లో ఉన్నాయి. విద్యార్థులకు కొంచెం శ్రమ పడితే విజయం మీదే. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు. అతి శ్రమకు తగిన విధంగా విశ్రాంతి తీసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు పెద్ద వారి ఆశీర్వచనం తీసుకోండి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం చక్కబడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనస్సు రాశి: అన్ని పనులకు అనుకూలమైన రోజు. ముఖ్యమైన విషయాలలో తల్లితండ్రుల అభిప్రాయం తెలుసుకోండి. ఉద్యోగంలో మీరు పడుతున్న శ్రమకు గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి ప్రోత్సాహకరంగా ధనలాభం. స్థిరాస్థి కొనుగోలుకు మంచి అవకాశం. ఫిట్ నెస్ కోసం పడుతున్న శ్రమ సత్ఫలితాలనిస్తుంది. సరైన ప్రణాళికతో పనులు సులభంగా జరుగుతాయి. ఆదాయం బాగున్నా కుటుంబ అవసరాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు ఈ రాశి స్త్రీలకు మీ సహనం ఓపిక సత్ఫలితాలను ఇస్తాయి.

మకర రాశి: వ్యాపారంలో అనుకున్నంత లాభాలు సాధిస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కోపం, నెగటివ్ థాట్స్, అత్యాశ మీ ఎదుగుదలకు నిరోధకాలు. దుబారా ఖర్చు వలననే పొదుపు చేయలేకపోతున్నామని గుర్తిస్తారు. కొంతమందికి ఇల్లు మార్పు శుభసూచకం. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు.శారీరక ఆరోగ్యం కోసం శ్రమిస్తారు. ఈ రాశి స్త్రీలకు దంపతులు ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడు కోవడం వలన అపార్థాలు తొలగి ఆనందం లభిస్తుంది.

కుంభరాశి: ఉద్యోగంలో అధిక శ్రమ. యోగా మెడిటేషన్ వలన శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది. కొంతమందికి ఎంతో కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు దూరం అయ్యే అవకాశం. దుబారా ఖర్చులు మీ డబ్బు పొదుపు కు గండి కొడుతున్నాయని గ్రహిస్తారు. ఆదాయం పెంచుకోవటానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగవద్దు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి: ఉల్లాసమైన మరియు ఉత్సాహమైన రోజు. స్థిరాస్తి వ్యవహారం కోర్టు కేసులో తీర్పు మీకు అనుకూలం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. వివాహం కొరకు ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సూచనలు. కొంతమందికి వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తి గురించి శుభవార్త. అంచనాలను మించి ఆదాయం ఉద్యోగంలో మీ సామర్థ్యంపై అందరి ప్రశంసలు ముఖ్యంగా పై అధికారుల మెప్పు పొందుతారు. ఈ రాశి స్త్రీలకు ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

Advertisement

Next Story

Most Viewed