- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శనివారం పంచాంగం, రాశిఫలాలు (05-06-2021)
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ఏకాదశి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 9 ని॥ నుంచి
మర్నాడు ఉదయం 6 గం॥ 19 ని॥ వరకు)
నక్షత్రం : రేవతి
(నిన్న రాత్రి 8 గం॥ 51 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 29 ని॥ వరకు)
యోగము : సౌభాగ్యము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (ఉదయం 10 గం॥ 10 ని॥ నుంచి 11 గం॥ 56 ని॥ వరకు)
అమ్రుత ఘడియలు : ( రాత్రి 8 గం॥ 49 ని॥ నుంచి 10 గం॥ 35 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 7 గం॥ 25 ని॥ నుంచి 8 గం॥ 17 ని॥ వరకు)
రాహుకాలం : (ఉదయం 8 గం॥ 56 ని॥ నుంచి 10 గం॥ 34 ని॥ వరకు)
గుళికకాలం : ( తెల్లవారు జాము 5 గం॥ 40 ని॥ నుంచి 7 గం॥ 18 ని॥ వరకు)
యమగండం : (మధ్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మీనము
మేష రాశి : ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. స్థిరాస్తి అమ్మకానికి సంబంధించి మంచి లాభాలు వస్తాయి. ఆఫీసులో పని పరంగా తోటి ఉద్యోగులతో భేదాభిప్రాయాలు రావచ్చు. పని ఒత్తిడి ఉండవచ్చు. డబ్బు పట్ల అలక్ష్యం గా ఉండకండి. తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. అనవసరపు భయాందోళనలను వదిలివేయండి. ఆత్మవిశ్వాసం సహనం పెంపొందించుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడతారు.
వృషభ రాశి : ఆర్థిక పరమైన విషయాలు బాగున్నాయి. మీ ఆశావహ దృక్పథం వలన ముఖ్యమైన నిర్ణయాలు సరిగా తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఉద్యోగంలో పురోగతి. ఆఫీసులో పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆత్మీయుల సలహాల వలన లాభాలు. అనవసరపు ఖర్చుల గురించి కుటుంబంలోని వ్యక్తులకు లెక్చర్ ఇస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మిమ్మల్ని సరిగా అర్థం చేసుకో లేనందుకు మానసిక అశాంతి.
సింహరాశి : జీవితంలో ఎదగడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తారు. మిమ్మల్ని మీరు సంస్కరించు కోవడం అందులో ముఖ్యమైనది. కావాల్సినంత ధనం చేతికందుతుంది. నూతన వాహనాల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆఫీసు పనిలో మీకు ఇచ్చిన కొత్త బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. స్నేహితుల మద్దతు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పుకార్లను నమ్మకండి ముఖాముఖి తెలుసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీరు మీ భర్త నుంచి ఏమి ఆశిస్తున్నారో అది అర్థమయ్యేటట్టు చెప్పండి. దానివలన మీ ఇద్దరి జీవితం ఆనందమయం.
కర్కాటక రాశి : మీ శత్రువులతో వాదోపవాదాలకు దిగవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కుటుంబంలోని వ్యక్తుల ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. వారిని విమర్శించి అనవసరపు గొడవలకు దిగకండి. సరైన ప్రణాళికతో అవసరమైన విషయాలు గురించి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి. డబ్బు, విలువైన వస్తువుల పట్ల నిర్లక్ష్యం వద్దు. తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడండి. బయట భోజనం కన్నా ఇంటి భోజనమే మిన్న. ఈ రాశి స్త్రీలకు అధిక శ్రమ వలన కీళ్ల నొప్పులు.
మిథున రాశి : అనవసరపు ఆందోళనల వలన మానసిక భయం. అందువల్ల ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడండి. సరైన ప్రణాళికతో పని చేయండి. అదనపు బాధ్యతల వలన ఆఫీసు పనిలో శ్రమ. పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారు. డబ్బు విలువ దుబారా ఖర్చు వలన వచ్చే నష్టం గుర్తిస్తారు. విద్యార్థులు చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టండి. విజయం తథ్యం. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
కన్యారాశి : ఆదాయంలో మరియు ఉద్యోగం లో పురోగతి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పరిస్థితులకు తగినట్టు మిమ్మల్ని మీరు మార్చుకోండి. దాని వలన సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఫిట్ నెస్ కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతాయి. కుటుంబంలోని వ్యక్తుల తో మనసు విప్పి మాట్లాడండి. ముఖ్యంగా మీ పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. అనవసరపు ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో కాకుండా వారి స్నేహితులతో గడపటం మీకు అశాంతి ఇస్తుంది.
తుల రాశి : కుటుంబ వ్యవహారాల కై సమయం కేటాయిస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులౌతారు అవి మీకెంతో మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయండి. దానివలన విశ్రాంతి పొందడానికి తగిన సమయం దొరుకుతుంది. ఈరోజు వ్యాపార విషయాల గురించి మాట్లాడటం అనవసరం. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. అనవసర ప్రయాణాలు మరియు దుబారా ఖర్చులు మిమ్మల్ని అశాంతికి గురి చేస్తాయి. ఈ రాశి స్త్రీలకు అధిక శ్రమ వలన కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తాయి.
వృశ్చిక రాశి : అధిక శ్రమతో అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. సరైన ప్రణాళికతో పని చెయ్యండి విజయం మీదే. ఉద్యోగంలో మీ నిజాయితీ సహనం అందరి మెప్పు పొందుతాయి. కావాల్సినంత ధనం చేతికందుతుంది. మీ వ్యక్తిత్వాన్ని అందరూ పొగుడుతారు సంఘంలో పేరుప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబ వ్యక్తులతో మనసువిప్పి మాట్లాడటం వలన ఆహ్లాదకర వాతావరణం ఈ రాశి స్త్రీలు ఇంటి అలంకరణకు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకర రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు. సరి అయిన గురువు కోసం ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు మీరు ఫుల్ క్లారిటీ గా ఉండండి. ఈ కరోనా సమయంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయటం మరియు పొదుపు చేయకపోవడం ఎంత తప్పో మీరు తెలుసుకుంటారు. వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణ కోసం తగిన ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
ధనస్సు రాశి : ఆర్థిక విషయాలు కొంచెం టెన్షన్ తెప్పిస్తాయి. అనవసరపు దుబారా ఖర్చులను నివారించండి. సరైన కమ్యూనికేషన్ వలన అన్ని విషయాలలో పురోగతి. ఆఫీసులో పనులన్నీ పట్టుదలతో పూర్తి చేస్తారు అందరి మెప్పు పొందుతారు. ప్రేమికులు తమ మనసులో మాట చెప్పడానికి అనువైన రోజు. రోజులో కొంత సమయాన్ని మీకు నచ్చిన విధంగా బతకటానికి ప్రయత్నం చేయడం వల్ల మీలో మంచి మార్పు.ఈ రాశి స్త్రీలకు మీ భర్త ప్రవర్తన వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం.
కుంభరాశి : ఈ రోజును చిరునవ్వుతో ప్రారంభిస్తారు. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వస్తాయి. ప్రేమికులకు తమ ప్రేమను ప్రకటించడానికి అనువైన రోజు. కుటుంబంలోని వ్యక్తుల పై హిట్లర్ లా దూకకండి. వారి అభిప్రాయాలు తెలుసుకోవడం వలన ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం. సరైన కమ్యూనికేషన్ వలన సంఘంలో పేరుప్రతిష్టలు. షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకండి. అనవసరపు ప్రణాళికల వలన డబ్బు సమయం రెండు వృధా. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో ఫుల్ జోష్ లో ఉండటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
మీన రాశి : కావలసినంత ధనం చేతికందుతుంది దాన్ని చేజారనీయకండి. సరైన ప్రణాళికతో ఖర్చు పెట్టండి పొదుపు చేయండి. కుటుంబ వ్యక్తుల మీద అజమాయిషీ చలాయించడం కన్నా వారితో ఆప్యాయతగా మాట్లాడటం వలన వారు ఎంతో దగ్గరవుతారు. ఉద్యోగం లో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. బయట భోజనం కన్నా ఇంటి భోజనమే మిన్న. దీనివలన ఆరోగ్య సమస్యలు రావు. యోగా మెడిటేషన్ చేయండి. దాని వలన మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ హుందాతనం మరియు వ్యక్తిత్వము అందరి మెప్పు పొందుతాయి.