ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఫ్యూచర్ గ్రూపునకు ఊరట!

by Harish |
ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఫ్యూచర్ గ్రూపునకు ఊరట!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్) నుంచి భారీ ఊరట లభించింది. ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు చెందిన కిషోర్ బియానీతో పాటు మరికొందరు సెక్యూరిటీ మార్కెట్లకు ఏడాది పాటు దూరంగా ఉండాలని ఈ నెల ప్రారంభంలో సెబీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రెండేళ్ల వరకు ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ షేర్ల క్రయవిక్రయాలను నిర్వహించకూడదని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ శాట్‌ను ఆశ్రయించింది. సోమవారం జరిగిన వాదనలో..కంపెనీ పునర్వ్యవస్థీకరణ 2017, ఏప్రిల్‌లో జరిగిందని, షేర్ల కొనుగోలు ప్రక్రియ మార్చిలో జరిగినట్టు ఫ్యూచర్ గ్రూప్ తరపు న్యాయవాది సోమశేఖర్ శాట్‌కు వివరించారు. దీనిపై స్పందించిన శాట్, సెబీ ఆదేశాలపై స్టే విధిస్తున్నట్టు తెలిపినిద్. అలాగే, ఫ్యూచర్ గ్రూప్ డిపాజిట్ కింద రూ. 11 కోట్లను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 12న జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed