ఆ వేధింపులతోనే సర్పంచ్ భర్త ఆత్మహత్య

by Shyam |
ఆ వేధింపులతోనే సర్పంచ్ భర్త ఆత్మహత్య
X

దిశ, రంగారెడ్డి: అవసరానికి ఆదుకునే అప్పు ఆ తర్వాత యమపాశంగా మారుతుందని ఎవరూ ఊహించరు. అందుకేనేమో చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలను సైతం అర్పించుకుంటారు. ఇటీవల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు అప్పు ఆసరా నిస్తున్నా.. కొన్ని సమయాల్లో మాత్రం ఆయువు తీస్తోంది. ఈ క్రమంలోనే ఓ సర్పంచ్ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. కోటపల్లి మండలం కంకణాల పల్లి గ్రామ సర్పంచ్ చంద్రకళ భర్త పాపిరెడ్డి. గతంలో ఆయన.. భార్య సర్పంచ్ ఎన్నిక కోసం, తనకున్న 12 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసేందుకు బ్యాంకు నుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి దాదాపు రూ. 8 లక్షలకు పైగా అప్పు తీసుకున్నాడు. అయితే, చేసిన అప్పులను మాత్రం తీర్చలేకపోయాడు. దీంతో అప్పులోళ్ల వేధింపులు తాళలేక తన వ్యవసాయ పొలంలోనే చెట్టుకు ఉరేసుకున్నాడు.

Advertisement

Next Story