- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్పంచులు కొత్త హైడ్రామా.. రాజీనామాలు చేసేందుకు రెడీ?
దిశ, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచులు సరికొత్త డ్రామాకు తెరలేపారు. జిల్లాస్థాయి అధికారులు తమ పనుల్లో లోటుపాట్లు చూపడంతో తాము అధికారుల వేధింపులు పడలేమంటూ మండలంలోని సర్పంచులందరూ శుక్రవారం మూకుమ్మడిగా బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సమావేశమైనట్లు సమాచారం. మండలంలోని ఓ పంచాయతీ సర్పంచ్ విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించకపోవడంతో జిల్లా స్థాయి అధికారులు కొంచెం క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.
అధికారుల పెత్తనం తమపై ఏంటని సర్పంచులందరూ గ్రూపు రాజకీయాలకు తెరతీసి రాజీనామాలతో బెదిరించి జిల్లా అధికారులను వాళ్ల గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో మరి కొంతమంది పంచాయతీ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాక అప్పుల పాలవుతున్నామని, అందుకే రాజీనామా చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అధికారుల ఒత్తిడి, పని భారం, లోటు బడ్జెట్ కారణంగా లక్షలు వెచ్చించి, అప్పులు చేసి పంచాయతీ పనులు చేపడుతున్నా.. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని అధికార, ఇతర పార్టీలకు చెందిన సర్పంచులు పార్టీకి, పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా బూర్గంపాడులో సమావేశమైన సర్పంచులందరూ తమ బాధలు, సమస్యలు ప్రభుత్వ విప్,స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.