- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్పంచులకు పందుల డ్యూటీ
దిశ, తెలంగాణ బ్యూరో : సర్పంచ్‌లకు కొత్త అధికారాలు లభించాయి. వారి పంచాయతీ పరిధిలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్‌గా వ్యవహరించడానికి అటవీ శాఖ పర్మిషన్ ఇచ్చింది. పంటలకు నష్టం చేస్తున్న అడవి పందులను వేటాడేందుకు, చంపేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అటవీశాఖ తరపున చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్‌కు ఉన్న అధికారాలన్నీ ఈ ఉత్తర్వుల ప్రకారం సర్పంచ్‌కు లభించనున్నాయి. అడవులు, రక్షిత ప్రదేశాలు, రిజర్వు ఫారెస్టుకు వెలుపల ఉన్న ప్రాంతాలలో మాత్రమే అడవి పందులను వేటాడేందుకు సర్పంచ్‌లకు ఈ అధికారాలు ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
షరతులు :
పంటలకు నష్టం కలిగిస్తున్నట్లు రైతుల నుంచి లేదా స్థానిక ప్రజల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు వస్తేనే సర్పంచ్ స్పందించాలి. ఫిర్యాదు వచ్చిన తర్వాత గ్రామ పెద్దలతో చర్చించాలి. నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లి పంట నష్టంపై పంచానామా జరపాలి. అడవి పందుల్ని చంపేయాలనే అభిప్రాయం వస్తే ఆ సిఫారసును పంచానామాలో పేర్కొనాలి. అడవి పందులను వేటాడి చంపేందుకు సర్పంచ్ నిర్ణయం తీసుకుని లిఖితపూర్వకంగా ఫారెస్టు బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్‌లకు అందజేయాలి. వాటిని వేటాడేందుకు షూటర్ల సాయం తీసుకోవాలి.
షూటింగ్‌కు ఉపయోగించే తుపాలకు లైసెన్సు ఉందో లేదో, ఆ షూటర్లు అటవీ శాఖ ప్యానెల్‌లో ఉన్నారో లేదో తేల్చాలి. వేటాడే సమయంలో ఇతర వన్యప్రాణులకు, మనుషులకు ప్రాణనష్టం కలగకుండా సర్పంచ్ బాధ్యత వహించాలి. పంటలకు మరింత నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అడవులు, రక్షిత ప్రదేశాలు, రిజర్వు ఫారెస్టు ప్రాంతాల్లో వేటాడకూడదు. చనిపోయిన పంది కళేబరాన్ని భూమిలో పాతిపెట్టాలి. వాటి చర్మాన్ని, మాంసాన్ని వినియోగించుకోకూడదు.
ఈ ప్రక్రియలో అటవీశాఖకు చెందిన సిబ్బందిలో కనీసం ఒక్కరైనా ఉండేలా సర్పంచ్ చూసుకోవాలి. పంది చనిపోయిన తర్వాత నిర్వహించిన పంచనామా రిపోర్టును ఫారెస్టు రేంజ్ ఆఫీసర్‌కు అందజేయాలి. రేంజ్ ఆఫీసర్ సైతం దాని ఆధారంగా నివేదిక తయారు చేసి జిల్లా ఫారెస్టు అధికారికి సమర్పించాలి. వేటాడే క్రమంలో ఇతర వన్యప్రాణులకు, మనుషులకు నష్టం జరిగితే అందుకు షూటర్‌దే బాధ్యత. అటవీ శాఖ సిబ్బంది ఇందుకు బాధ్యత వహించరు. చీఫ్ వైల్డ్ లైప్ వార్డన్‌గా సర్పంచ్‌కు ఇచ్చిన అధికారాలు ఏడాది వరకు మాత్రమే వర్తిస్తాయి.