- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కోరిక తీరుస్తావా లేదా.. సర్పంచ్ భర్తను చితకబాదిన మహిళలు
దిశ, పాలకుర్తి : గ్రామంలోని మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ మహిళ సర్పంచ్ భర్తను చితకబాదారు గ్రామస్తులు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామ సర్పంచ్ మంజుల భర్త సుధాకర్ గ్రామంలోని మహిళలను టార్గెట్ చేస్తూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
తనకు నచ్చిన మహిళ.. తన కోరిక తీర్చే విధంగా.. ఓ మహిళను మధ్యవర్తిగా పెట్టుకుని రాయబారాన్ని కూడా నడిపించాడు. తనకు నచ్చిన వారి ఫోన్ నెంబర్ తీసుకని ఫోన్‌లో లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో కాల్ బయటకు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఈ క్రమంలో సదురు మహిళ, గ్రామస్తులు సర్పంచ్ ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో బాధిత మహిళలకు సర్పంచ్ మంజుల క్షమాపణలు తెలిపారు. అయితే గతంలో వ్యభిచార ఆరోపణతో.. పోలీసులు హన్మకొండలోని అన్నపూర్ణ లాడ్జిపై దాడిచేయగా సుధాకర్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుపడ్డాడు.