సర్ఫరాజ్‌ కాంట్రాక్టును తగ్గించిన పీసీబీ

by Shyam |
సర్ఫరాజ్‌ కాంట్రాక్టును తగ్గించిన పీసీబీ
X

దిశ, స్పోర్ట్స్:

పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు షాక్ ఇచ్చేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. 2020-21 సీజన్‌కు గాను కొత్తగా ప్రకటించనున్న సెంట్రల్ కాంట్రక్టులో మొత్తం 19 మందికి అవకాశం కల్పించనున్నారు. అయితే గతంలో మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన సర్ఫరాజ్ కాంట్రాక్ట్ గ్రేడ్‌ను మాత్రం ‘ఏ’ నుంచి ‘సీ’ స్థాయికి తగ్గించనుంది. గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా నాకౌట్ స్థాయికి కూడా చేరుకోలేదు. దీనికి కెప్టెన్ సర్ఫరాజ్, కోచ్ ఆర్థర్‌లే కారణమని పాక్ బోర్డు వారిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే సర్ఫరాజ్‌ను కెప్టెన్ పదవి నుంచి తొలగించినా.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం కొనసాగించింది. కానీ ఆ తర్వాత అతని బ్యాటింగ్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో జట్టు నుంచి తొలగించింది.

ప్రస్తుతం పాక్ జట్టులో సభ్యుడిగా లేకపోయినా.. సర్ఫరాజ్ కాంట్రాక్టును తగ్గించి కొనసాగించడం గమనార్హం. భవిష్యత్తులో అతనికి మళ్లీ జట్టులో స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కాంట్రాక్టును కొనసాగించారని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎలాంటి మ్యాచ్‌లు లేవు. వాస్తవానికి మేలో పాక్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది.

Advertisement

Next Story

Most Viewed