జానపదంతో రౌడీ బేబీ మాయ.. సారంగదరియా 200M+

by Anukaran |
Sai Pallavi Saranagadhariya Still
X

దిశ, సినిమా: ఫిదా ఫేమ్ సాయిపల్లవి యాక్టింగ్‌తోనే కాదు డ్యాన్స్‌తోనూ మాయ చేస్తుందన్న విషయం తెలిసిందే. గతంలో ధనుష్‌తో కలిసి చేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్‌తో యూట్యూబ్ రికార్డులు కొల్లగొట్టిన మలార్ బ్యూటీ.. ‘సారంగ దరియా’ పాటతో మరోసారి మాయచేసింది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాలోని ఈ పాట తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రముఖ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజా రాసిన పాటకు మంగ్లీ వాయిస్ సరికొత్త ఫ్లేవర్‌ను యాడ్ చేయగా.. డ్యాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి స్టెప్పులు మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. పవన్ మ్యూజిక్ అందించిన సాంగ్ ‘ఆదిత్య మ్యూజిక్’ ద్వారా విడుదల కాగా, మూణ్నెళ్లు పూర్తికాకుండానే టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్‌ 200 మిలియన్ వ్యూస్‌ పొందిన లిరికల్ వీడియోగా రికార్డు సాధించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె. నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడ్డ విషయం తెలిసిందే.

Advertisement

Next Story