అర్జున్ రెడ్డిని పెళ్లిచేసుకుంటా.. బాలీవుడ్ స్టార్ నటి హాట్ కామెంట్స్

by Shyam |   ( Updated:2023-05-19 11:24:14.0  )
అర్జున్ రెడ్డిని పెళ్లిచేసుకుంటా.. బాలీవుడ్ స్టార్ నటి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. అర్జున్ రెడ్డి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘లైగర్‌’లో నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న హీరోయిన్‌లలో సారా అలీఖాన్ పేరు కచ్చితంగా ఉంటుంది. అమ్మడు కూడా విజయ్‌కి పెద్ద ఫ్యాన్. ఎంతలా అంటే పెళ్లి చేసుకునేంత అని చెప్పుకోవచ్చు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న నటి విజయ్‌పై తనకున్న అభిమానాన్ని తెలిపింది. షోలో భాగంగా ‘నీ స్వయంవరానికి ఎవరెవరు రావాలని కోరుకుంటావు’ అని అడుగగా. సారా వరుసగా పేర్లు చెప్పడం ప్రారంభించింది. ‘వరుణ్ ధావన్, రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్, తెలుగు హీరో విజయ్ దేవరకొండ’ అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులంతా వీరిలో ముగ్గురికి పెళ్లి అయిపోయిందని, అంటే సారా ఇండైరెక్ట్‌గా విజయ్‌తో పెళ్లికి ఓకే అంటుందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed