- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘నా వాడు అని గర్వంగా చెప్పుకోవాలి’’
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఓ క్లారిటీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ బాలీవుడ్ బామ స్టార్ కిడ్ కావడంతో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే తొలిసారి తన వ్యక్తిగత జీవితం గురించి తన సవతి తల్లి అయిన కరీనా కపూర్ షోలో వెల్లడించారు. ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాల్సినవి.. చెప్పకూడనివి అన్ని ముక్కుసూటిగా చెప్పారు.
‘‘నాకు కాబోయేవాడిలో నేను ముందుగా చూసేది నిజాయతీ. అంతేకాదు అతనికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండాలి. అందగాడు కాకపోయినా ఫర్వాలేదు. ఒకందుకు అది కూడా మంచిదే. ఎందుకంటే అందగాడు అయితే వాడిని నేను భరించలేను. అలాగని చెండాలంగా ఉండాలని నా ఉద్దేశం కాదు. నేను అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంలేదు. ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమిస్తే.. అతను నా వాడు అని నేను చెప్పుకోవడానికి గర్వంగా ఫీలవ్వాలి. ఎందుకంటే నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి. అంతకుమించి నాకు ఇవ్వగలిగే వ్యక్తి నాకు దొరికినప్పుడే నేను ప్రేమలో పడతాను. అంతేకాదు నేను ఇప్పటివరకు ఎవ్వరితోనూ సెక్స్ చేసింది లేదు. అలాంటి రిలేషన్‌షిప్స్‌కి నేను దూరంగా ఉంటాను’’ అంటూ ధైర్యంగా అన్ని విషయాలను సారా షోలో పంచుకుంది. ప్రస్తుతం సారా ‘లవ్ ఆజ్ కల్’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తన తండ్రి నటించిన ‘లవ్ ఆజ్ కల్’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతోంది. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి నెగిటివ్ టాక్ వస్తోంది. సినిమా ఆడదని ముందే చెప్పేస్తున్నారు. ఎందుకంటే ట్రైలర్‌లో సారా నటన చెత్తగా ఉందట. ట్రైలర్ చూసాక బుద్ధి ఉన్నవాడు ఎవ్వడూ సినిమాకు వెళ్లడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.