- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నీ అమ్మ నుంచే నేర్చుకున్నా : సారా
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. బాలీవుడ్‌లోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయ్యాక చాలా చేంజ్ ఉందన్న సారా.. ఇండస్ట్రీలో లేని రోజులు అసలు గుర్తు లేవని చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భామ.. బీ టౌన్‌లో భాగం కాకపోతే ఎలా ఉంటుందో మరిచిపోయానని.. ఈ అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. బయటి వ్యక్తి, లోపలి వ్యక్తిగా మారినప్పుడు ప్రతీది మారుతుందని.. ప్రతీ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పింది.
రెండేళ్లలోనే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ.. యాక్టింగ్, స్టైల్ తన తల్లి నుంచే సంక్రమించాయని, అందుకు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నానని చెప్పింది. ఏ విషయంలో అయినా చివరి నిర్ణయం నీదే ఉండాలని చెప్పే అమ్మ.. ఇతరుల నుంచి సలహాలు తీసుకోవాలి తప్ప ఫైనల్ డెసిషన్ నీ చేతుల్లోనే ఉండాలని, నువ్వు ఒక పని చేయకూడదని అనుకున్నప్పుడు, చేయకుండా ఉండటమే బెస్ట్ థింగ్ అని అమ్మ చెప్తుందని వెల్లడించింది. కాగా ఈ యంగ్ బ్యూటీ నటించిన ‘కూలీ నెం.1’ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాగా, మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్‌తో కలిసి ‘అత్రాంగి రే’ సినిమాలో నటిస్తోంది.