- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ వయసులో డేటింగ్ కష్టమే.. స్టార్ హీరో కూతురి కామెంట్
దిశ, సినిమా : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సంజయ్ దత్ కుతూరు త్రిషాల దత్.. ఆదివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ సెషన్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన 33 ఏళ్ల త్రిషాల.. ఈ వయసులో డేటింగ్ ‘డిజాస్టర్’ వంటిదని పేర్కొంది. రిలేషన్‌లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ అందులో నుంచి బయటపడటం చాలా కష్టమని తెలిపింది. ప్రేమాభిమానాలతో చూసుకునే జెంటిల్‌మ్యాన్ దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. మంచి కుటుంబం, సంతోషకరమైన జీవితం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది.
ఇక సంజయ్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రశ్నకు ‘ప్రస్తుతానికి సొంత లైఫ్‌స్టైల్‌తో సంతోషంగా ఉన్నట్లు జవాబిచ్చింది. కాగా చిన్నపుడే తల్లిని కోల్పోయిన త్రిషాల యూఎస్‌లో సైకోథెరపిస్ట్‌గా సెటిలైన విషయం తెలిసిందే.