ఫ్యాషన్‌తో సంజనా ప్రయాణం..

by Shyam |   ( Updated:2020-10-05 03:28:10.0  )
ఫ్యాషన్‌తో సంజనా ప్రయాణం..
X

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా ‘దిల్ బెచారా’ హీరోయిన్ సంజనా సంఘీ.. ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుశాంత్‌కు పోటీగా నటించి కిజీ బసుగా బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది. ఐతే తను లాక్‌డౌన్‌లో ‘దిల్ బెచారా’ సినిమాతో పాటు అందుకున్న సక్సెస్ మరొకటి ఉందని.. అదే భారతదేశంలో పిల్లలకు విద్యా సాధికారత కల్పించడంపై దృష్టి సారించడం అని.. మానవతా దృక్పథంతో చేసిన ఈ పని చాలా సంతృప్తినిచ్చిందని చెప్పింది.

ఈ క్రమంలో కరోనా కారణంగా చాలా రంగాలు సామాజికంగా, ఆర్థికంగా నష్టోయాయని తెలుసుకున్నట్లు చెప్పిన సంజనా.. వాటిలో స్వదేశీ ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా ఉన్నట్టు తెలుసుకున్నానని చెప్పింది. ఈ మహమ్మారిని తట్టుకోగలమా? ఈ పరిస్థితుల్లో ముందుకు సాగగలమా? అనే ప్రశ్న వాటిలో తలెత్తిందని.. అది తనకు చాలా ఆందోళన కలిగించిందని తెలిపింది.

అందుకే దేశంలోని అలాంటి సృజనాత్మక వ్యాపారాలకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలిపింది. ఫ్యాషన్‌తో ప్రయాణం.. అంతకు ముందు లేని మార్గాల్లో వ్యక్తీకరించేందుకు, తనను తాను కనుగొనేందుకు అవకాశం కల్పించిందని చెప్పింది. చీకటి ఆకాశంలో చిన్న ఇంద్రధనుస్సుగా మారే అవకాశం ఇచ్చినట్లుగా ఉందన్నది. భారతీయ ప్రత్యేకమైన, అద్భుతమైన స్వదేశీ ఫ్యాషన్ బ్రాండ్లు ప్రపంచంలోని ఫాస్ట్ ఫ్యాషన్ ఆధిపత్యంలో అభివృద్ధి చెందాలని, పోటీ పడాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఎందుకంటే ‘మీరు చేసేది చాలా ప్రత్యేకమైంది’ అని చెప్తూ.. ఆల్ ది బెస్ట్ చెప్పింది సంజన.

Advertisement

Next Story