ఇర్ఫాన్ మాటలు చాలా ప్రభావితం చేశాయి : సంజనా సంఘీ

by Jakkula Samataha |
ఇర్ఫాన్ మాటలు చాలా ప్రభావితం చేశాయి : సంజనా సంఘీ
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ సంజనా సంఘీ ‘దిల్ బెచారా’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి ‘ఓమ్ : ది బ్యాటిల్ వితిన్’ మూవీ చేస్తున్న హీరోయిన్.. తన యాక్టింగ్ స్కిల్స్ పెంచుకునేందుకు లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్‌ ఎలాంటి సూచనలు చేశారో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇర్ఫాన్ నటించిన ‘హిందీ మీడియం’ సినిమాలో చిన్న క్యారెక్టర్ ప్లే చేసిన సంజన.. ఈ సినిమా సెట్స్‌లో తనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించిందని తెలిపింది.

ఇర్ఫాన్ ఖాన్ మాటలు తనను చాలా ప్రభావితం చేశాయని చెప్పింది. స్క్రిప్ట్‌లో ఉన్న లైన్స్ గుడ్డిగా ఫాలో కాకుండా, యాక్టర్స్ సీన్స్‌‌ను ఇంప్రవైజ్ చేయాలని సూచించేవారని తెలిపింది. స్క్రిప్ట్‌ ఓన్‌ చేసుకున్నప్పుడు కెమెరా ముందు నటించే సన్నివేశం మరో లెవల్‌కు రీచ్ అవుతుందని సజెషన్స్ ఇచ్చేవారని, థియేటర్‌పై దృష్టి కేంద్రీకరించి, నటుడిగా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలని ఇర్ఫాన్ సజెషన్స్ ఇచ్చేవారని చెప్పింది. తను చెప్పిన సూచనలను ఫాలో అయి బెస్ట్ ఔట్‌పుట్ చూశానని, తన మాటలు ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపింది.

Advertisement

Next Story