కంపుకొడుతోందంటున్న ‘సర్కారు’ విద్యార్థులు

by Sridhar Babu |
Sanitation problem, government schools
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. టాయిలెట్స్ క్లీనింగ్‌ చేయకపోవడంతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్‌కు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని అధికారులు చెప్తున్నప్పటికీ ఆచరణలో సాథ్యం కావడం లేదు. పాఠశాలలకు కెటాయించే నిధులు అంతంత మాత్రమే కావడం ఒకటైతే పంచాయతీ సిబ్బందిచే పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవడం కూడా అసాధ్యంగా మారింది. దీంతో సర్కారు బడుల్లో విద్యార్థులు దుర్ఘంధం, అపరిశుభ్రమైన వాతావరణంలో చదువుకునే పరిస్థితి తయారైంది. ఆయా పంచాయితీలు, మున్సిపాలిటీలకు చెందిన శానిటేషన్ సిబ్బందితో ఈ పనులు చేయించాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితులు ఇందుకు ప్రతికూలతను కనబరుస్తున్నాయి.

నిధుల కొరత..

పాఠశాలకు కెటాయించే నిధులతో శానిటేషన్ స్టాఫ్‌ను నియమించుకునే పరిస్థితి లేదు. అయితే సంబంధిత పంచాయితీలు, మున్సిపాలిటీలు పాఠశాలల ఆవరణ పరిశుభ్రంగా ఉంచేందుకు శానిటేషన్ సిబ్బందిని పంపించాలని ప్రభుత్వం సూచించింది. వీరిచే స్కూల్ కంపౌండ్ లలో శుభ్రం చేయిస్తున్నారు తప్ప.. టాయిలెట్స్ క్లీన్ చేసేందుకు మాత్రం చొరవ తీసుకోవడం లేదు. దీంతో చాలా పాఠశాలల్లో దుర్ఘంధం వెదజల్లుతూ అనారోగ్యాన్ని పంచుతున్న పరిస్థితి తయారైంది. అయితే పంచాయితీ పాలకవర్గానికి మాత్రం ఉన్న ఆదేశాలు కూడా పాఠశాలల పరిశుభ్రతకు ఆటంకంగా ఉన్నాయి. ఆయా పంచాయితీ పరిధిలో రోజుకో ప్రభుత్వ కార్యాలయ ప్రాంతంలో క్లీన్ చేయించేందుకు సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో నిత్యం శానిటేషన్ చేసే పరిస్థితి లేకుండా పోతోంది.

టీచర్స్ కాంట్రిబ్యూషన్..

కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ క్లీన్ చేసేందుకు టీచర్లే కాంట్రిబ్యూషన్ వేసుకుని ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యకర వాతావరణంలో బోధన చేపట్టడం వల్ల తమతో పాటు స్టూడెంట్స్‌కు కూడా మంచిది కాదన్న ఉద్దేశ్యంతో కాంట్రిబ్యూషన్ విధానంతో డబ్బు జమ చేసి వేతనంగా ఇస్తున్నారు.

నాటి గణాంకాలే..

పాఠశాలల్లో మౌళిక వసతులతో పాటు ఇతరత్రా సిబ్బందిని నియమించుకునేందుకు 2011 నాటి గణాంకాలనే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అప్పడు స్టూడెంట్స్ ను బట్టి మంజూరు చేసిన పోస్టులను పెంచకపోవడం గమనార్హం.

Advertisement

Next Story