సానియా మీర్జా అరుదైన రికార్డు

by Shyam |
సానియా మీర్జా అరుదైన రికార్డు
X

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నది. జులై 23 నుంచి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల ఆడనున్నది. కాగా భారత్ తరపున నాలుగు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న మహిళా అథ్లెట్‌గా సానియా మీర్జా అరుదైన రికార్డును సృష్టించనున్నది. డబుల్స్ విభాగంలో సానియా మీర్జా, అంకిత రైన కలసి పోటీ పడనున్నారు. ఇప్పటికే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన సానియా.. అక్కడ పలు గ్రాస్ కోర్టు టోర్నీల్లో పాల్గొంటున్నది. కేవలం టెన్నిస్ మ్యాచ్‌లు ఆడటమే కాకుండా బయట జిమ్‌లో తీవ్రమైన కసరత్తులు చేస్తున్నది. ఫిట్‌నెస్‌ను పెంచుకోవడమే కాకుండా గాయాల పాలు కాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సానియా తెలిసింది. ‘ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించడం చాలా గౌరవంగా భావిస్తాను. నేను వయసు గురించి ఎప్పుడూ ఆలోచించను. ముప్పైల్లో ఉన్నా నాకు ఆట ఆడగలిగే సామర్థ్యం ఉందని విశ్వాసంతో ఉన్నాను. నేను ఆటపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను’ అని సానియా అన్నది. అంకిత రైనా 15 ఏళ్లు ఉన్నప్పుడు కలిశాను. తాను చాలా క్రమశిక్షణ కలిగిన అథ్లెట్. తనతో ఒలింపిక్స్ ఆడటం చాలా ఆనందంగా ఉన్నదని సానియా తెలిపింది.



Next Story