తెలంగాణలో మత్స్యకారులకు మంచి రోజులు

by Shyam |
తెలంగాణలో మత్స్యకారులకు మంచి రోజులు
X

దిశ, ఆందోల్: సీఎం కేసీఆర్ పాలనలో మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని, గత ప్రభుత్వాలు మత్స్యకారులను పట్టించుకోలేదని సంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. ఆందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో ఉన్న వీరన్న చెరువులో గురువారం జెడ్పీ చైర్ పర్సన్ 23 వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆందోల్ నియోజకవర్గంలో ఇప్పటివరకూ మత్స్యకారులు రూ.2.55 కోట్లు చేపలను విక్రయించి లబ్ధి పొందారన్నారు. వీటితో పాటు అన్ని కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మత్స్యకారులు యూనిట్‌గా ఏర్పడి చేపలను విక్రయించుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కింద రూ. 6 లక్షలను అందిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Next Story