గులాబీ తోటలోకి కాంగ్రెస్ కౌన్సిలర్లు

by Shyam |
గులాబీ తోటలోకి కాంగ్రెస్ కౌన్సిలర్లు
X

దిశ, మెదక్: కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ విశ్వాసం కోల్పోతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసే కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. మంగళవారం సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి పట్టణ అభివృద్ధి బాధ్యత తనదే అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి రవి, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story