- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ వద్దకు రైతులను తీసుకెళ్లిన సండ్ర
దిశ, సత్తుపల్లి: రైతుల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పలువురు రైతులు జిల్లా కలెక్టర్ గౌతమ్‌ను కలిశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి మండల పరిధి కొమ్మెపల్లి గ్రామానికి చెందిన రైతులు.. తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు కొందరు వ్యక్తులు ఉత్తర్వులు తీసుకొచ్చారని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వారి గోడు విన్న సండ్ర వెంకటవీరయ్య సోమవారం బాధిత రైతులతో జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చారు. సాగు చేస్తున్న పొలాలకు సంబంధించి పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్లు సదరు రైతుల మీద ఉన్నాయని కలెక్టర్‌కు వివరించారు. కానీ, చెరువును కబ్జా చేసి పాస్ పుస్తకాలు చేయించుకున్నారని చెప్పి ఖమ్మం స్పెషల్ ట్రిబ్యునల్ కోర్టు నుంచి కొందరు వ్యక్తులు ఉత్తర్వులు తీసుకొచ్చారని వాపోయారు. తమ తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి అని.. అదే పొలంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని.. తమకు న్యాయం చేయవల్సిందిగా రైతులు సండ్ర సమక్షంలో కలెక్టర్‌ను కోరారు.