తండ్రి స్టైల్లో భుజాన తుపాకీ.. అదిరిపోయిన వీరప్పన్ కూతురి ఫస్ట్‌లుక్

by Shyam |
veerappan daughter vijaylakshmi
X

దిశ, వెబ్‌డెస్క్: గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ రెండో కూతురు విజయలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కథానాయికగా వినూత్న కథతో తెరపై కనిపించనున్నారు. ఆమె నటిస్తున్న సినిమాకి ‘మావీరన్‌ పిళ్లై’ అనే టైటిల్ నిర్ణయించారు. కేఎన్‌ఆర్‌ మూవీస్‌ పతాకంపై కేఎన్‌ఆర్. రాజా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రవివర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ శుక్రవారం(ఏప్రిల్ 2,2021) విడుదల చేయగా, ఇందులో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్‌ స్టైల్లో తుపాకీని భుజాన వేసుకుని నిలబడింది. ఈ ఫస్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ గురించి పరిచయం అక్కర్లేదు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలకు చెమటలు పట్టించిన స్మగ్లర్‌. 2004లో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ చేసిన ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్‌ చనిపోయాడు. ఈయన జీవితంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కాగా, వీరప్పన్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె విద్యారాణి రీసెంట్‌గానే బీజేపీలో చేరింది. కాగా.. రెండో కుమార్తె విజయలక్ష్మి సినీ రంగ ప్రవేశం చేసింది.

Advertisement

Next Story