- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్ కేసు..
దిశ, వెబ్‌డెస్క్: శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేదికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సూచించినా.. తాను ఈ సమయంలో విచారణకు హాజరుకాలేకపోతున్నానని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన పోస్ట్ పెట్టిన రాగిణి.. ఇంటరాగేషన్‌కు రాలేకపోతున్న కారణాన్ని తన న్యాయవాదులు పోలీసులకు వివరించారని చెప్పింది. ఒక్కరోజు ముందు నోటీస్ అందడం వల్ల తాను అందుబాటులో లేకపోతున్నానని, సోమవారం ఉదయం పోలీసుల ముందు హాజరవుతానని తెలిపింది. పోలీసుల విచారణకు హాజరవడాన్ని నా బాధ్యత అనుకుంటున్నానని.. దాచడానికి ఏమీ లేదని.. తనకు ఎలాంటి డ్రగ్ మాఫియాతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సపోర్ట్‌గా ఉన్న అందరికీ ధన్యవాదాలు చెప్పింది.
కాగా, శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్ కేసులో ఆర్టీఓ ఆఫీస్‌లో క్లర్క్‌గా చేస్తున్నరాగిణి ద్వివేది ఫ్రెండ్ రవి అరెస్ట్ అయ్యాడు. తనతో పాటు మరికొంత మంది డ్రగ్ డీలర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని విచారించగా.. శాండల్‌వుడ్‌లో చాలా మంది నటీనటులు డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం బయటపడింది. కాగా, ఈ విషయంపై సమావేశమైన కర్ణాటక ఫిల్మ్ చాంబర్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. డ్రగ్ రాకెట్ కేసుతో సంబంధం ఉన్నట్లు ప్రూవ్ అయితే ఆ నటుల మీద చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.