పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా.. నిద్ర మత్తులో అధికారులు..

by Shyam |   ( Updated:2021-12-20 01:21:05.0  )
పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా.. నిద్ర మత్తులో అధికారులు..
X

దిశ, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో వట్టి వాగు పరివాహక పంట పొలాల్లో నుండి అక్రమంగా ఇసుక తోడుతున్నారు. అక్రమ ఇసుక వ్యాపార దందా పట్టపగలే యథేచ్ఛగా జరుగుతున్న సంబంధింత అధికారులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకులే ఇసుక వ్యాపారులుగా అవతారమెత్తారు. బెదిరింపు లకు పాల్పడుతూ.. ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఎంపీ మలోత్ కవిత వర్గం, ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గం, ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గం అని చెప్పుకుంటూ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

వెంకటగిరి, కాట్రపల్లి, ఆర్పణ పల్లి, ఉప్పరపల్లి, పెనుగొండ గ్రామాలలోని వాగుల సమీపంలో ఉన్న పంట పొలాల నుండి రెవెన్యూ అనుమతులు లేకుండా ఇసుకను తోడుతున్నారు. వెయ్యి పెట్టుబడి పెట్టి రూ.5 వేల నుండి 6 వేల వరకు ట్రాక్టర్ ఇసుక ను అమ్ముతున్నారు. అక్రమంగా పంట పొలాల నుండి ఇసుక ను తీసి లక్షల రూపాయల ను కూడపెడుతున్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి, మైనింగ్, రెవెన్యూ, పోలీసులు శాఖ వారు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సీజ్ చేస్తున్నాము.. ఎస్సై రమేష్ బాబు

అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్న సమాచారం వస్తే ఆ ట్రాక్టర్ లను సీజ్ చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. గతంలో కొన్ని ట్రాక్టర్ లు సీజ్ కూడా చేశామని, అక్రమ ఇసుక వ్యాపారం చేస్తే చర్యలు తీసుకుంటాం హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed