- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొందరికి స్యాండ్.. ఇంకొందరికి స్యాడ్!
దిశ, మహబూబ్‌నగర్: ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీ విధానంతో జిల్లావ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రం అయ్యింది. దీన్ని క్యాచ్ చేసుకుంటున్న ఇసుకా సూరులు దందా మొదలు పెట్టడంతో నిర్మాణ వ్యయాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో చాలామంది కార్మికులకు కూలీ పని దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో రాజకీయ నేతలు కూడా ఇసుకను తరలిస్తూ కాసులు సంపాదిస్తున్నారన్న ఆరోపణలు సైతం వినపడుతున్నాయి. దీంతో జిల్లాలో ఇసుక దందా స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది.
ఇసుక తరలింపు విషయంలో కిందిస్థాయి రెవెన్యూ అధికారుల నుంచి పైస్థాయి పోలీస్ శాఖ వరకు ఒక్కో విధంగా రేటు ఉన్నట్లు సమాచారం. కిందస్థాయి వారికి నెలకు రూ.5 వేలు, పెద్ద వారికి రూ.50 వేల వరకు మామూళ్లు ముట్ట చెబుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని వాగుల నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నా పట్టించుకునేనాథుడు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో కృతిమ ఇసుక తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. వాగుల్లో నుంచి వచ్చిన మట్టిని తరలించి దానిలో నుంచి కృత్తిమ ఇసుకను తయారు చేసి, నిర్మాణాలు చేపట్టడం వల్ల నాణ్యత తగ్గుతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇలాంటి ఇసుక తయారీ కేంద్రాలు జిల్లావ్యాప్తంగా వెలుస్తున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న కామెంట్లు వినపడుతున్నాయి.
ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక రూ.4 వేల నుండి రూ.5 వేల వరకు పలుకుతుండగా ఫిల్టర్ చేసిన ఇసుకను సామాన్యులకు అంటగట్టి మోసం చేస్తున్నారు. అదే సమయంలో వాగులోని ఇసుక మరింత ప్రియం కావడంతోపాటు టిప్పర్ ఇసుక రూ.20 వేలకుపైగానే పలుకుతుండటంతో అధికారులు, ఇసుక తయారీదారులకు కాసుల వర్షం కురుస్తోంది. గతంలో రూ.1,000 నుండి రూ.1,500 వరకు ట్రాక్టర్ ఇసుక దొరికేదని ప్రస్తుతం ఇసుక కొని ఇళ్ళ నిర్మాణం చేపట్టాలంటే తలకు మించిన భారంగా మారుతోందని గ్రామీణ ప్రాంతాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక పాలసీ ప్రభుత్వానికి కాసులు కురిస్తుందో లేదో కానీ సామాన్యులకు మాత్రం మరింత భారంగా మారిందన్న విమర్శలు వినపడుతున్నాయి.
Tags: sand shortage, mahabubnagar dist, telangana govt