- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాలీ సైజ్ తగ్గించి నిలువు దోపిడీ
దిశ ప్రతినిధి, కరీంనగర్: సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సామాన్యులు పడుతున్న కష్టాలే వారికి ప్రధాన ఆదాయంగా మారింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు అడ్డగోలు ధరలు పెట్టి అమ్మకాలు జరపడమే కాదు. ఏకంగా ట్రాక్టర్ ట్రాలీ సైజులను తగ్గించి మరీ నిలువుదోపిడీ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నయా ట్రెండ్‌తో సామాన్యులను నిండా ముంచుతున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియా ఇప్పుడు సరికొత్త దోపిడీకీ శ్రీకారం చుట్టింది. 100 ఫీట్ల వరకు ఉండాల్సిన ట్రాక్టర్ ట్రాలీని తగ్గించి ఇసుక అమ్మకాలు జరుపుతున్నారు.
రూ. 5 వేల వరకు వసూలు..
ఒక్కో ట్రాక్టర్ కు రూ. 4 వేల నుంచి 5 వేల వరకు వసూలు చేస్తున్న మాఫియా 4 టన్నుల వరకు ఇసుకను ఒక్కో ట్రాక్టర్ ద్వారా సరఫరా చేసేది. దీంతో సామాన్యుడు టన్ను ఇసుకకు రూ. 1,000 నుంచి 1,250 చొప్పున ధర చెల్లించాల్సి వచ్చేది. డిమాండ్ ఉన్న కాలంలో అయితే ఈ ధర మరింత పెంచుతారు. అయితే ఇసుక ట్రాక్టర్ స్మగ్లర్లు మరో అడుగు ముందుకేసి మరింత దోపిడీకి పాల్పడుతున్నారు.
ట్రాలీ సైజు తగ్గించి..
గతంలో 90, 100 ఫీట్ల సైజులో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ సైజును ఇప్పుడు 75 నుంచి 80 ఫీట్ల వరకు తగ్గించి ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో 3 నుంచి 3.5 టన్నుల లోపునే ఇసుక ట్రాలీలో లోడ్ అవుతోంది. తక్కువ క్వాంటిటీకి ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి సామాన్యులకు ఎదురవుతోంది. అసలే దొంగచాటుగా కొనే ఇసుక కావడంతో ఇసుక అవసరం ఉన్న వారు తూకం వేసే పరిస్థితి కూడా ఉండదు. దీంతో వారి అవసరాలను ఆసరాగా చేసుకున్న స్మగ్లర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనే పర్మిట్ ఉన్న ఇసుకకు రూ. 1,150 వరకు ధర పలుకుతుంటే అక్రమంగా కరీంనగర్ జిల్లాలో విక్రయిస్తున్న ఇసుకకు మాత్రం అంతకన్నా ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. ట్రాలీ బాడీ సైజ్ తగ్గించే విధానంతో మరింత దోపిడీకి పాల్పడుతున్నా ఇసుక మాఫియాను నిలువరించే వారే లేకుండా పోయారు.
టోల్ గేట్ల ఏర్పాటు..
కరీంనగర్ జిల్లా మీదుగా ప్రవహిస్తున్న మానేరు నది నుంచి ఇసుకను తరలించేందుకు స్మగ్లర్తు మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. మాఫియా రింగ్‌గా ఏర్పడి ఇసుకను తరలిస్తూ మెయింటనెన్స్ ఖర్చుల పేరిట ట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తున్నారు. నిర్భయంగా సాగుతున్న ఈ తంతును నిలువరించే వారే లేకుండా పోయారు.
అర్ధరాత్రి గొడవ..
కరీంనగర్ సమీపంలోని మానేరు నది వద్ద బాహాటంగా సాగుతున్న ఈ విధానాన్ని అడ్డుకునే వారే లేరన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ మానేరు నదిలో ఇసుక మాఫియా ఫిర్యాదులు చేసుకోగా అర్ధరాత్రి పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌తో పాటు మరో కార్పొరేటర్ కూడా ఇందులో ప్రత్యక్ష్యంగా ఉన్నా చర్యలు మాత్రం తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే గన్నేరువరం మండలంలోని ఓ వాగులో ఏకంగా పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. మరో వైపు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు సర్పంచ్ పై దాడి జరిగింది. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ కు ఓ గ్రామానికి రూ. వంద చొప్పున టోల్ ఫీజు చెల్లిస్తున్నారని తమ గ్రామానికి కూడా ఇవ్వాలని ఆవునూరు సర్పంచ్ పట్టుబట్టడంతో ఈ గొడవ జరిగినట్లు సమాచారం. యథేచ్ఛగా సాగుతున్న ఇసుక మాఫియా ఆగడాలను నిలువరించకపోతే మరిన్ని దారుణాలు జరిగే ప్రమాదం ఉంది.