- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆదర్శ గ్రామంలో ఆ దందా కోసం బహిరంగ వేలం.. ఒక్కొక్కరికి రూ. లక్ష
దిశ, నిర్మల్ రూరల్: ఆ గ్రామం ఇసుక దందాకు పెట్టింది పేరు. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా ఇసుక నిల్వలు కనిపిస్తాయి. గోదావరి నది పక్కనే ఉన్న ఆ ఊరు ఇసుక దందాకు అడ్డాగా మారింది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ భూగర్భజలాలను నాశనం చేస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవరిస్తున్నారని స్థానికులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని ఆదర్శనగర్ గ్రామానికి సమీపంలో ఉన్న గోదావరి నది నుండి ఇసుక తరలించుటకు గ్రామస్తులు ఏకంగా బహిరంగ వేలం నిర్వహించగా దాదాపు 10 లక్షల రూపాయలకు గ్రామానికి చెందిన వ్యక్తి వేలం దక్కించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో చుట్టు పక్కల గ్రామాలతోపాటు పక్క మండలాల నుండి ట్రాక్టర్ యజమానులతో లోపాయికర ఒప్పందం చేసుకొని ఒక్కొక్క ట్రాక్టర్ యజమాని నుండి దాదాపు ఒక లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం: ఎమ్మార్వో
గోదావరి నది నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మామడ ఎమ్మార్వో కిరణ్మయి అన్నారు. ఇప్పటికే నిల్వ ఉన్న పలు ఇసుక డంపులను సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు.