ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ‘కత్తి’ బ్యూటీ

by Shyam |
ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ‘కత్తి’ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ సనా ఖాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడై బ్ చెప్పేస్తున్నట్లు తెలిపింది. కొన్నేళ్లుగా సినిమా రంగంలో పని చేస్తున్న తనకు దేవుడు, అభిమానుల దయ వల్ల కీర్తి, గౌరవం, సంపద చేత ఆశీర్వదించబడ్డానని..ఇందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. కానీ, కొన్ని రోజుల క్రితం తనలో ఒక రియలైజేషన్ స్టార్ట్ అయిందని చెప్పింది. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలోకి వచ్చింది కేవలం డబ్బు, ఫేం సంపాదించేందుకేనా అనే ప్రశ్న తనలో మొదలైందని చెప్పింది. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం పనిచేయడం మన బాధ్యత కాదా? మనిషి ఏ నిమిషమైనా చనిపోవచ్చు.. కానీ, అతను చనిపోయాక తనకు ఏం జరుగుతుంది?. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను అని.. ముఖ్యంగా మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? అనే ప్రశ్న తనను తొలిచేస్తుందని తెలిపింది.

ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్నప్పుడు.. మరణం తర్వాత జీవితాన్ని మెరుగుపరిచేందుకే దేవుడు ఈ లైఫ్ ఇచ్చాడని రియలైజ్ అయినట్లు తెలిపింది. ఆ సృష్టికర్త ఆదేశాలకు అనుగుణంగా ఇతరులకు సహాయం చేయడమే జీవితమని..కేవలం డబ్బు, ఫేం కోసం జీవించకూడదని అర్థం చేసుకున్నట్లు చెప్పింది సనా ఖాన్. ఆ సృష్టికర్త అడుగుజాడల్లో నడుస్తూ మానవసేవలో నిమగ్నం అవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది. కాబట్టి ఈరోజు నుంచి సినిమా ఇండస్ట్రీకి, జాయ్ ఫుల్ లైఫ్ స్టైల్‌కు ఇక ఎప్పటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. మానవత్వ సేవలో జీవితాన్ని గడపాలనే తన సంకల్పానికి అనుగుణంగా జీవించే సామర్థ్యం, పట్టుదల ఇవ్వాలని తన కోసం దేవుడిని ప్రార్థించాలని కోరారు. ఇక నుంచి సినిమా ఇండస్ట్రీ పనుల గురించి తనను సంప్రదించరాదని అభ్యర్థించింది.

బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది సనా ఖాన్. తెలుగులో మిస్టర్ నూకయ్య, కళ్యాణ్ రామ్ ‘కత్తి’, గగనం లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. కాగా, కొరియోగ్రఫర్ మెల్విన్ లూయిస్‌తో ఏడాది పాటు రిలేషన్ షిప్‌లో ఉన్న సనాఖాన్..తనను చాలా టార్చర్ చేశాడని గతంలో చెప్పింది. తన నుంచి విడిపోయాక ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలే తనను ఇలా మార్చేశాయని అనుకుంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story

Most Viewed