- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి పనిలో.. ‘స్మార్ట్ రోబోస్’
దిశ, వెబ్‌డెస్క్: గుమ్మం ముందు నిలబడగానే తెరుచుకునే తలుపులు, ఇంట్లో అడుగుపెట్టగానే వెలిగే లైట్లు, ఇలా చిటికేస్తే అలా తిరిగే ఫ్యాన్లు.. సాంకేతిక యుగంలో ఇల్లంతా టెక్ మయమే. ఈ క్రమంలోనే ఇంటిపనిని కూడా మరింత స్మార్ట్‌గా చేసేందుకు ‘శాంసంగ్’ రోబోలను తీసుకొస్తోంది. 2021లో మార్కెట్‌లోకి తీసుకురాబోతున్న ఆ రోబోలే.. జెట్‌బోట్ 90 ఏఐప్లస్, శాంసంగ్ బోట్ కేర్, శాంసంగ్ బోట్ హ్యాండీ.
జెట్‌బోట్ 90 ఏఐప్లస్ :
ఈ ప్రొడక్ట్‌ను సెప్టెంబర్ లోగా యూఎస్ మార్కెట్‌లో లాంచ్ చేయడానికి శాంసంగ్ ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ఇది వ్యాక్యూమ్ క్లీనర్‌గా పనిచేస్తుంది. భిన్నరకాలైన ఆబ్జెక్ట్స్‌ను గుర్తిస్తూ, వాటికి అనుగుణంగా పనిచేస్తుంది. 3డీ సెన్సార్స్ కలిగి ఉన్న ఈ రోబో కేబుల్స్, వైర్లను గుర్తించి వాటికి ఎలాంటి నష్టం చేయకుండా, జాగ్రత్తగా గదుల మూలలను కూడా క్లీన్ చేయడం దీని ప్రత్యేకత. కెమెరా కూడా ఉండటం వల్ల దీన్ని మనం శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు.
శాంసంగ్ బోట్ కేర్ :
ఒంటరి వారికి కంపెనీ ఇవ్వడంతో పాటు ఒక అసిస్టెంట్‌గానూ పనిచేస్తుంది. ఏఐ సాంకేతికతో ఎదుటివారి బిహేవియర్‌ను గుర్తించి అందుకు అనుగుణంగా రెస్పాండ్ అవుతుంది. షెడ్యూల్స్ ప్రిపేర్ చేయడంతో వాటిని రిమైండ్స్ చేస్తుంది. అంతేకాదు వీడియోకాల్ కూడా చేస్తుంది.
శాంసంగ్ బోట్ హ్యండీ :
ఈ రోబో.. మనం తిన్న తర్వాత ప్లేట్ తీసి, దాన్ని డిష్‌వాషర్‌లో లోడ్ చేస్తుంది. టేబుల్‌ను సెట్ చేయడంతో పాటు కిరాణా సామాను, బట్టలకు కేటాయించిన కప్‌బోర్డ్స్‌లో వాటిని అమరుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వివిధ రకాల ఆబ్జెక్ట్స్ పరిమాణం, వెయిట్, షేపులను గుర్తిస్తుంది. అంతకుమించి ఇది గ్లాసులో వైన్ పోసి, ఆ డ్రింక్ సర్వ్ చేస్తుంది.