- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ?
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న రిటైర్ అవుతున్నారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు మూడు నెలల పాటు పదవీకాలం పొడిగింపు ఇవ్వాలని ఏపీ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పొడిగింపుపై అధికారికంగా కేంద్రప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో ఈనెలాఖరున ఆయన రిటైర్ కావాల్సి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయి ఏపీకి రావడం హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఆదిత్యనాథ్ దాస్ స్థానంలో సమీర్ శర్మను నియమించే అవకాశం ఉండటంతో ఆయన కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే 1985 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ ప్రస్తుతం కేంద్రంలోని కీలకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదిత్యనాథ్ దాస్ సమీర్ శర్మకంటే రెండేళ్లు జూనియర్. కానీ వయసులో మాత్రం ఐదు నెలలు చిన్న. దీంతో సమీర్ శర్మ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టినా ఐదునెలలు మాత్రమే ఆ పదవిలో కొనసాగుతారు. రిటైర్మెంట్ అయినా మళ్లీ కేంద్రానికి లేఖ రాసి కొనసాగింపు ఇప్పించుకునే అవకాశం ఉండొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి.