సమంతకు బంపర్ ఆఫర్.. వారి కాంబో రిపీట్..?

by Shyam |   ( Updated:2021-11-24 01:44:00.0  )
సమంతకు బంపర్ ఆఫర్.. వారి కాంబో రిపీట్..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా సమంత హాట్టాపిక్‌గా ఉంది. మొదట తన విడాకుల విషయం కాగా ఆ తర్వాత అమ్మడి సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా సమంత మూవీ కెరీర్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాను ఓ ఊపుఊపేస్తోంది. సమంతకు టాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ వచ్చిందట. రాజమౌళి-మహేష్ కాంబోలో రానున్న సినిమా కోసం జక్కన్న సమంతను సంప్రదించాడట. ఈ ఆఫర్‌కు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలు కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇంతకుముందు మహేష్‌తో సమంత జత కట్టిన సినిమాలు, రాజమౌళిలతో చేసిన ఈగ సినిమా బంపర్ హిట్‌లు అయ్యాయి. దీంతో వీరి ముగ్గురి కాంబోలో వచ్చే సినిమా అందరికీ పిచ్చెక్కిస్తుందని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో రానుందని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అందులో ఏమాత్రం నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

బాయ్‌ఫ్రెండ్ కోసం అమెరికా చెక్కేసిన రష్మిక..?

Advertisement

Next Story