‘ఊ అంటావా మావా’… సెక్సీగా ఉంది కదా!: సమంత

by Shyam |   ( Updated:2021-12-21 10:14:41.0  )
Samantha
X

దిశ, సినిమా : ‘పుష్ప’ చిత్రం విడుదలై వారం గడుస్తున్నా.. ఇంకా ఈ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మూవీలో సమంత ఐటమ్ సాంగ్, మాస్ డ్యాన్స్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ‘మీ మగ బుద్ధి వంకర బుద్ధి’ అనే లిరిక్స్‌పై పురుషులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సాంగ్‌లో అదిరిపోయే ప్రదర్శన చేసి, అభిమానులను అలరించడానికి తాను ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, తన ప్రతిభను గుర్తించకుండా ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ తాజాగా సమంత స్పందించింది.

ఈ క్రమంలోనే పాటకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన నటి.. ‘నేను మంచిగా చేశాను. చెడుగా కూడా చేశాను. కొన్ని సందర్భాల్లో సీరియస్‌ అవుతూ.. మరికొన్ని సార్లు నవ్వించాను. నేను ఎంచుకునే ప్రతి పనిలో ఉత్తమంగా రాణించడానికి కష్టపడతాను. కానీ సెక్సీగా కనిపించడమనేది నెక్స్ట్ లెవల్ హార్డ్ వర్క్. ఊ అంటావా సాంగ్‌‌పై లవ్ చూపిస్తున్న అందరికీ థాంక్యూ’ అని తెలిపింది. ఇక సమంత వివరణపై మరోసారి స్పందించిన నెటిజన్లు.. ‘ఏది ఏమైనా నీ ఫర్ఫార్మెన్స్‌తో చంపేశావ్ బేబీ’ అంటున్నారు.

చై-సామ్ విడాకులకు నాగ్, అమలనే కారణమా.. డివోర్స్ ముందు జరిగింది ఇదేనా..!

ఇండస్ట్రీ హాట్ టాపిక్.. సమంత కోసం రంగంలోకి మరో స్టార్ హీరో.

‘సమంత ఓ సెకండ్ హ్యాండ్ ఐటెమ్.. అతడి జీవితాన్ని నాశనం చేసింది’

Advertisement

Next Story