చైతన్యను పట్టించుకోకుండా.. వాళ్లతో ఎంజాయ్‌ చేసిన సమంత

by Shyam |   ( Updated:2023-03-30 17:23:58.0  )
samantha
X

దిశ, సినిమా : టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ సమంత – అక్కినేని నాగచైతన్య విడాకుల మ్యాటర్ ట్రెండింగ్‌లో ఉండగా.. చైతు హీరోగా నటించిన ‘లవ్ స్టోరి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సామ్ అటెండ్ కాకపోవడం మరోసారి ఇందుకు బలం చేకూరుస్తుంది. అంతేకాదు ఈ సమయంలో చైతును పట్టించుకోకుండా.. హీరోయిన్లు త్రిష, కీర్తి సురేశ్, కళ్యాణి ప్రియదర్శన్‌తో కలిసి ఎంజాయ్ చేసిన సెల్ఫీని పోస్ట్ చేసింది. లాస్ట్ వీక్ మెమరబుల్ మూమెంట్స్ అంటూ ఈ ఫొటోతో పాటు పెట్స్ హ్యాష్, సాషతో స్పెండ్ చేసిన పిక్స్ షేర్ చేసింది. మొత్తానికి నలుగురు హీరోయిన్లు కలిసి ఉన్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ‘గార్జియస్ ఏంజిల్స్ ఇన్ వన్ ఫ్రేమ్’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed