సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్?

by Shyam |
సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్?
X

దిశ, సినిమా: నాగచైతన్యతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంత.. ఫ్రెండ్స్‌తో వెకేషన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇదే క్రమంలో ఫిల్మ్ కెరీర్‌‌పైనా కాన్సంట్రేట్ చేసిన సామ్.. మళ్లీ సినిమాలతో బిజీగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు నేచురల్ స్టార్ నాని ‘దసరా’ మూవీలో నటించేందుకు అంగీకరించిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. మరో కథానాయిక కోసం మేకర్స్ సమంతను సంప్రదించినట్లు టాక్. కానీ సామ్ ఇప్పటికే కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌లో సినిమా సహా తెలుగులో ‘శ్రీదేవి’ మూవీకి కమిటైన సంగతి తెలిసిందే. అయితే తను ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో పాటు నాని సినిమాకు కూడా సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉండగా.. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. కాగా గతంలో నాని – సామ్ జంటగా వచ్చిన ‘ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Advertisement

Next Story