Samantha: అరుదైన రికార్డు.. సౌత్ ఇండస్ట్రీలోనే తొలి నటిగా గుర్తింపు

by Shyam |   ( Updated:2021-11-08 09:30:18.0  )
Samantha
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్యతో ఇటీవల విడాకులు తీసుకొని, వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోన్న సమంతకు అరుదైన గౌరవం లభించింది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)లో ప్రసంగించేందుకు సమంతకు ఆహ్వానం అందింది. ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రసంగించేందుకు ఆహ్వానించబడిన మొదటి సౌత్ ఇండియన్ నటిగా సమంత రికార్డు సృష్టించింది. సమంతతో పాటు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దర్శకురాలు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని కూడా వక్తలుగా ఉన్నారు. అంతేగాకుండా.. సమంతతో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో నటించిన మనోజ్ బాజ్‌పేయి కూడా వక్తల్లో ఒకరిగా ఉన్నారు. కాగా, ఇప్పటికే సౌత్ ఇండియా అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడిన సమంత, చాలాకాలం సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణించారు. దీంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

మరోసారి వార్తల్లో నిలిచిన సమంత స్టైలిస్ట్.. ఎందుకంటే ?

ఈ అందాలన్నీ నాకు దేవుడిచ్చిన గిఫ్ట్.. స్టార్ మోడల్

Advertisement

Next Story

Most Viewed