- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైనా తగ్గని సమంత మాయ
దిశ, వెబ్‌డెస్క్: సమంత అక్కినేని తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు మాయ చేస్తూనే ఉంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూనే ఉంది. చైతుతో పెళ్లి తర్వాత సమంత మాయ పనిచేయకుండా పోతుందేమో అనుకున్నా.. అది కాస్త డబుల్ అయింది. మ్యారేజ్ అయిన హీరోయిన్‌కు మామూలుగా అవకాశాలు రావడమే గగనం… కానీ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటన్న సామ్… మజిలీ, ఓ బేబి, యూ టర్న్ లాంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను కూడా మాయ చేసేసింది.
తద్వారా ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్ అయ్యే న్యూస్ తెచ్చేసింది. ఆమె అంత అందంగా నవ్వులు చిందించే ఘనతను సొంతం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా తన లుక్స్, యాటిట్యూడ్‌తో ఇన్స్‌పైర్ చేసిన ఈ లేడి.. ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019గా నిలిచింది. పలు రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్లలోపు మహిళలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. కొత్త తరం వచ్చాక కూడా తన అప్పియరెన్స్‌తో కుర్రకారు మతిపోగొట్టిన సామ్ ఒక మ్యారీడ్ ఉమెన్ ఇలాంటి ఘనత సాధించవచ్చని నిరూపించింది. కుర్ర హీరోయిన్లు వచ్చినా ఏ మాత్రం క్రేజ్ తగ్గని సామ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే, క్యూట్ హీరోయిన్ రష్మిక మందన్నా లాంటి వారు తనకు పోటీ కానే కాదని తేల్చేసింది. కాగా, ఈ జాబితాలో మిస్ ఇండియా-2019 రన్నరప్ సంజనా విజ్, పీవీ సింధూ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలవగా… అదితీరావు హైదరీ నాల్గో స్థానం, పూజా హెగ్డే ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. అమెరికన్ ఇండియన్ సాంగ్ రైటర్ రాజాకుమారి ఆరో స్థానం సంపాదించగా.. రకుల్‌ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, రష్మిక మందన్నా వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో నిలిచారు.
tags : Samantha Akkineni, Most Desirable Women 2019, Majili, Oh Baby, Naga Chaitanya