'సామ్ జామ్'.. అల్లరే అల్లరి!

by Shyam |
సామ్ జామ్.. అల్లరే అల్లరి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంత ఎదిగినా.. ఎన్ని విధాలుగా రాణించినా.. సమంతలో ఉండే చిన్నపిల్ల మనస్తత్వం మాత్రం మారలేదనిపిస్తోంది. అదే అల్లరి.. అదే నవ్వు.. మనందరికీ పంచేందుకు, తన క్యూట్ అండ్ స్వీట్ స్మైల్‌తో మనల్ని హ్యాపీగా ఉంచేందుకు తను ‘సామ్ జామ్’ అంటూ వచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కరోజు బిగ్ బాస్ హోస్ట్‌గా అదరగొట్టిన సామ్.. మరింత అల్లరి, చిలిపితనంతో ‘సామ్ జామ్ షో’ను ఓ రేంజ్‌కు తీసుకుపోగలదని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ షోకు సంబంధించి రిలీజైన ప్రోమో.. సూపర్ ఎంటర్టైన్మెంట్ పంచుతుండగా, ఫస్ట్ ఎపిసోడ్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. నాటీ క్వశ్చన్స్ అడుగుతూ విజయ్ ఫ్యాన్స్‌కు సూపర్‌గా నచ్చేసేలా ప్రోగ్రాం నడిపించిన సామ్.. అటు ఆడియన్స్‌తోనూ కలిసిపోయి అల్లరి చేసేసింది.

Advertisement

Next Story