స్కూబా డైవ్‌తో సామ్ సర్‌ప్రైజ్!

by Anukaran |   ( Updated:2020-11-23 05:37:23.0  )
స్కూబా డైవ్‌తో సామ్ సర్‌ప్రైజ్!
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత అక్కినేని ప్రజెంట్ జనరేషన్‌కు ఇన్‌స్పిరేషనల్ ఐకాన్‌గా నిలుస్తోంది. తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ ఒక్కో అడుగు వేస్తూ.. ఒక్కో అచీవ్‌మెంట్‌తో శభాష్ అనిపించుకుంటోంది. భర్త నాగ చైతన్య పుట్టినరోజు వేడుకను మాల్దీవ్స్‌లో ప్లాన్ చేసిన సామ్.. ఒక్కరోజు ముందుగానే అక్కడికి వెళ్లి సూపర్‌గా సెలబ్రేట్ చేసింది. ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేయాలనే సిద్ధాంతంతో ముందుకెళ్లే సామ్.. మాల్దీవ్స్‌లో కొత్తగా మరో ఫీట్ చేసి చూపించింది. స్కూబా డైవ్ చేసి వావ్ అనిపించింది. ‘మొత్తానికి సాధించా.. సముద్రంలో డైవ్ చేశా’ అని పోస్ట్ పెట్టగా, అభిమానులు అప్రిషియేట్ చేస్తున్నారు. సముద్రం లోపల గ్రేట్ టైమ్ దొరికింది కదా అని అందరూ అంటుంటే.. మరిది అఖిల్ మాత్రం ‘అసలు నేను నమ్మలేకపోతున్నాను’ అని కామెంట్ పెట్టాడు. కాగా ఈ పిక్‌కు ఇప్పటికే 12 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం.

ఇక సామ్ .. ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌తో హోస్ట్‌గా బిజీ అయిపోయింది. మరోవైపు ‘ది ఫ్యామిలీ మాన్ 2’ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. ఇందులో నెగెటివ్ రోల్ పోషించిన సామ్.. ఆడియన్స్‌కు మరోసారి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇక తమిళ్‌లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో తెరెకెక్కుతున్న ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమాలో విజయ్ సేతుపతి, నయన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది సామ్.

Advertisement

Next Story