- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యాన్స్ తో సామ్ చిట్ చాట్
సమంత అక్కినేని.. ఏ మాయ చేసావే సినిమాతో ఏ ముహుర్తాన తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిందో కానీ.. ఇప్పటికీ తన అందం, అభినయం, ఆత్మవిశ్వాసంతో మాయ చేస్తూనే ఉంది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత బెస్ట్ క్యారెక్టర్స్ ఎంచుకుని.. సెలెక్టెడ్ మూవీస్ చేస్తున్న సామ్ అకౌంట్ లో అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో 10 మిలియన్ల ఫాలోవర్స్ సంపాదించుకున్న సామ్.. అభిమానులతో ఆన్ లైన్ చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
1. లాక్ డౌన్ లో మీరు నేర్చుకున్నది ఏంటి?
మనం కలల వెంట పరుగెతాల్సిన.. కల ఇంట్లో కూడా ఉంటుంది.. కుటుంబం ప్రేమ రూపంలో..
2. మీ జీవితంలో మీరు గర్వంగా ఫీల్ అయ్యే విషయం?
మీరు ఎవరో గర్వపడాలి .. అన్నింటికన్నా ఎక్కువ .. ఎందుకంటే మీకు మీరు ఒక స్పెషల్ పర్సన్..
3. అక్కినేని కుటుంబం గురించి?
బెస్ట్ జీన్స్..
4. అమల అక్కినేని మీ లైఫ్ లో ఎంత ప్రధానం?
ఫ్రెండ్ మరియు గైడ్
5. రామ్ చరణ్, ఉపాసన గురించి చెప్పాలంటే?
నిజంగా వారిద్దరూ నాకు స్ఫూర్తి.. వారిని ఆరాధిస్తాను
6. రానా మిహీక బజాజ్ గురించి ఒక్క మాటలో?
ప్రేమ
7. మీ పెంపుడు కుక్క పిల్ల హష్ గురించి మీరు ఈ మధ్య తెలుసుకున్నది?
వాడి గురించి వాడికి చాలా నమ్మకం.. అన్నింట్లోనూ మాస్టర్ అని ఫీల్ అయిపోతుంటాడు
8. రామ్ పోతినేనితో ఎప్పుడు మూవీ చేస్తారు?
అమ్మో .. తన ఎనర్జీ రీచ్ కావాలంటే చచ్చిపోవాల్సిందే
9. సెలెబ్రిటీగా హార్డేస్ట్ పార్ట్?
మన గురించి నిజం కాని విషయాలు వినడం
10. జిమ్ లో ఎక్కువ వర్క్ చేసేది ఎవరు.. మీరు లేక నాగ చైతన్య?
చైతన్య వర్క్ అవుట్ చేస్తాడు.. నేను నటిస్తాను
11. సెల్ఫ్ క్వారంటైన్ లో ఫిట్ గా ఉండేందుకు ఏం చేస్తుంటారు?
అడపాదడపా ఉపవాసం.. రోజూ బిర్యాని తింటున్నా, స్పైసీ గా ఉండే ఆహారం తీసుకుంటున్నా.. ఇప్పటికీ మూడు సీసాల అవకాయ అయిపోయింది.. కాబట్టి సామ్ మళ్లీ గుడ్ గర్ల్ కావాలంటే ఉపవాసం అవసరం
12. ఫ్యాన్స్ గురించి?
బలం మరియు బలహీనత
13. హేటర్స్ కు మీరిచ్చే సమాధానం?
నిజానికి అభినందలు సోమరిని చేస్తే.. అవమానాలు ఉత్తమంగా పనిచేసేలా ప్రేరేపిస్తాయి.. కాబట్టి అవి కూడా ఉండాలి.