సూర్య మూవీ.. సామ్ ఎమోషనల్

by Shyam |
సూర్య మూవీ.. సామ్ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెజాన్ ప్రైమ్‌లో రిలీజై, బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా.. ఇన్‌స్పిరేషనల్ స్టోరీగా పలువురి ప్రశంసలు అందుకుంది. కెప్టెన్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సుధ కొంగర డైరెక్టర్ కాగా.. హీరో సూర్య మెయిన్ లీడ్ ప్లే చేశారు. అపర్ణ బాలమురళి హీరోయిన్ కాగా, ఊర్వశి ప్రధానపాత్రలో కనిపించారు. కాగా ఈ సినిమా చూసిన అక్కినేని వారి కోడలు సమంత ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ‘ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌తో వచ్చిన సినిమాను ఆణిముత్యంగా అభివర్ణించారు. నాకు కావాల్సిన స్ఫూర్తిని నింపిందంటూ ఎమోషనల్ అయ్యారు.

https://twitter.com/Samanthaprabhu2/status/1333733007090282496?s=20

కాగా ఈ మధ్యే భర్త చైతుతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ నుంచి తిరిగొచ్చిన సామ్.. సూర్యతో కలిసి ‘24, సికిందర్’ లాంటి సినిమాల్లో నటించింది.

Advertisement

Next Story