- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమాజ్‌వాదీ పార్టీ నేత హత్య.. కెమెరాలో రికార్డ్
లక్నో: ఉత్తరప్రదేశ్ సంభల్ జిల్లా స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నేత, అతని కుమారుడిని ఇద్దరు వ్యక్తులు కెమెరాలో రికార్డ్ అవుతుండగానే తుపాకీతో కాల్చి చంపారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా పంట పొలాల గుండా వేస్తున్న రోడ్డుపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరిగింది. ఒకరినొకరు చంపేస్తామన్న బెదిరింపులు సైతం చేసుకున్నారు. చివరికి సమాజ్‌వాదీ పార్టీ నేత, అతని కొడుకును ఇద్దరు వ్యక్తులు పొట్టనబెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సంభల్ జిల్లాలోని షాంసోయి గ్రామానికి చెందిన పొలాల గుండా వేస్తున్న రోడ్డు పనిని పరిశీలించేందుకు సమాజ్‌వాదీ పార్టీ స్థానిక నేత చోటేలాల్ దివాకర్, అతని కుమారుడు సునీల్ వెళ్లారు. అయితే, ఆ రోడ్డు తమ పొలాల్లో నుంచి వెళ్లుతున్నదని ఇద్దరు వ్యక్తులు కొన్నాళ్లుగా అభ్యంతరం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఇతరులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. దీంతో తుపాకులతో వచ్చిన ఇద్దరు వెనక్కి మళ్లారు. మళ్లీ ముందుకు వచ్చి కాల్చేశారు. ఈ ఘటనకు ముందు.. కాలుస్తారా? కాల్చేయండి అన్న మాటలూ వీడియోలో వినిపించాయి. దివాకర్ భార్యనే షాంసోయి గ్రామ సర్పంచ్ కావడం గమనార్హం.