చందమామకు సామ్ గిఫ్ట్..

by Anukaran |   ( Updated:2020-10-11 06:58:36.0  )
చందమామకు సామ్ గిఫ్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: చందమామ కాజల్ త్వరలో బుగ్గన దిష్టి చుక్క పెట్టుకుని.. పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇదిలా ఉంటే, అక్కినేని వారి కోడలు సమంత ఇటీవలే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సాకి’ క్లాత్ బ్రాండ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు బబ్లీ బ్యూటీ కాజల్‌కు సమంత తన ‘సాకి’ బ్రాండ్ తరపున కొన్ని బట్టలను బహుమతిగా ఇచ్చింది. కాగా ఈ విషయాన్ని కాజల్ తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ‘డియర్ కాజల్ అగర్వాల్.. నా కొత్త ప్రయాణాన్ని నీతో సెలబ్రేట్ చేసుకునేందుకు.. ప్రేమతో ఓ చిన్న బహుమతిని అందిస్తున్నాను. నీకు తప్పకుండా ఈ కానుక నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అంటూ తన సాకి బ్రాండ్ ఉత్పత్తులను కాజ‌ల్‌కు పంపించింది సామ్. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు స్పందించిన కాజల్.. ‘కొత్త వెంచర్ స్టార్ట్ చేసినందుకు కంగ్రాట్స్ సామ్’ అంటూ గుడ్ విషెస్‌ను తెలియజేసింది.

ఇక రాంచరణ్ వైఫ్ ఉపాసన.. కాజల్‌కు లంచ్ ఆఫర్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ముంబైలోని తన ఫేవరెట్ రెస్టారెంట్‌లో ఉపాసనతో కలిసి లంచ్ చేసింది కాజల్. ఈ సందర్భంగా స్పందిచిన బ్యూటీ.. ‘నా ప్రియమైన ఉప్సీ .. థ్యాంక్యూ సో మచ్. నీ ఆలోచనలు నన్నెప్పుడూ సంతోషపెడుతుంటాయి. నీ రాకతో నన్ను ఎంతో టచ్ చేశావు’ అని తెలిపింది.

Advertisement

Next Story